Newjerusalemnotes
  • Login
  • Home
  • Christian News
  • Bible Study
  • Church
  • Worship
  • Contact Us
  • Register
No Result
View All Result
  • Home
  • Christian News
  • Bible Study
  • Church
  • Worship
  • Contact Us
  • Register
No Result
View All Result
Newjerusalemnotes
No Result
View All Result
Home Bible Study

బైబిలులో ఉపవాసం చేసే వివిధ విధానాలు

newjyizh by newjyizh
February 28, 2026
Reading Time: 3 mins read
0


ఇప్పుడు ఉపవాసం అంటే ఏమిటో, అది ఎందుకు ముఖ్యమో మనకు అర్థమైంది కాబట్టి, బైబిలులో చెప్పబడిన వివిధ ఉపవాస విధానాలను మరియు వాటి ద్వారా వచ్చిన శక్తివంతమైన ఫలితాలను చూద్దాం.


బైబిలులో ఉపవాసం చేసే వివిధ విధానాలు

1. చిన్న ఉపవాసం
(ఒక రోజు లేదా కొన్ని గంటలు / 1-రోజు ఉపవాసం):

న్యాయాధిపతుల గ్రంథంలో, ఇశ్రాయేలీయులు దేవుని నుండి త్వరితమైన నడుపుదల కోసం  సాయంత్రం వరకు ఒక రోజు ఉపవాసం చేశారు (న్యాయాధిపతులు 20:26).

ఫలితం — దేవుడు వారికి శత్రువులపై విజయం ఇచ్చాడు.


2. సంపూర్ణ ఉపవాసం
(ఆహారం లేదు, నీరు లేదు / 3-రోజుల ఉపవాసం):

ఎస్తేరు మరియు షూషను పట్టణంలోని యూదులు తమ ప్రజలను రక్షించమని దేవుని యొక్క సహాయం కోరుతూ మూడు రోజులు మూడు రాత్రులు నిరంతరంగా ఉపవాసం చేశారు.

ఫలితం — దేవుడు యూదులను రక్షించాడు, హామానును ఓడించాడు  (ఎస్తేరు 4:16).


3. భాగిక / పాక్షిక ఉపవాసం
(పండ్లు మరియు కూరగాయల వంటి సాధారణ ఆహారం / 21-రోజుల ఉపవాసం):

దానియేలు మూడు వారాలు రుచికరమైన ఆహారం తినకుండా, మాంసం తినకుండా, ద్రాక్షారసం తాగకుండా ఆత్మీయ అవగాహన కోసం ఉపవాసం చేశాడు (దానియేలు 10:2-3).

ఫలితం — దేవదూత దర్శనం పొందాడు మరియు ఆత్మీయ అవగాహన లభించింది.


4. దీర్ఘ ఉపవాసం
(అనేక రోజులు / 40-రోజుల ఉపవాసం):

మోషే:

దేవుని నడిపింపు మరియు ఒడంబడిక కోసం మోషే 40 రోజులు ఉపవాసం చేశాడు.

ఫలితం — మోషేకు ధర్మశాస్త్ర సూచనలు మరియు ఒడంబడిక లభించింది (నిర్గమకాండము 34:28).

ఎలీయా:

దివ్య సన్నిధి అనుభవం మరియు ప్రకటన కోసం ఎలీయా 40 రోజులు ఉపవాసం చేశాడు.

ఫలితం — దేవుడు ఎలీయాను పునరుద్ధరించాడు మరియు చిన్న స్వరంలో దేవుడు మాట్లాడాడు (1 రాజులు 19:8).

యేసు:

సేవకు సిద్ధపడటానికి మరియు శోధనలను జయించడానికి యేసు 40 రోజులు ఉపవాసం చేశాడు (మత్తయి 4:2; లూకా 4:2).

ఫలితం — యేసు ఆత్మ శక్తితో గలిలయకు తిరిగి వచ్చాడు, కఠినమైన శోధనలను ఎదుర్కొన్నాడు, అద్భుతాలు చేశాడు, ఉపమానాల ద్వారా సువార్తను ప్రకటించాడు (లూకా 4:14).


5. నియమిత ఉపవాసం
(జీవనశైలిగా ఉపవాసం):

అన్నా (ప్రవక్తురాలు) రాత్రింబగళ్లు ఉపవాసం చేస్తూ, ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధించింది — నిరంతర ఆత్మీయ ఎదుగుదల కోసం.

ఫలితం — ఆమె మెస్సీయా (యేసు)ను చూసింది మరియు ఆయన గురించి సాక్ష్యమిచ్చింది (లూకా 2:37-38).


6. వ్యక్తిగత ఉపవాసం
(వ్యక్తిగతంగా చేసే ఉపవాసం):

దావీదు పశ్చాత్తాపంతో మరియు ప్రార్థనలకు సమాధానం రావాలని వ్యక్తిగతంగా ఉపవాసం చేశాడు (కీర్తనలు 35:13).

ఫలితం — దేవునితో అతని సంబంధం మరల నూతనపరచబడింది మరియు బలపడింది.


7. సమూహ ఉపవాసం
(సమూహం / సంఘంగా చేసే ఉపవాసం):

యోనా సందేశం విన్న తర్వాత, నినెవె పట్టణమంతా దేవుని నమ్మి, పశ్చాత్తాపంతో సమూహంగా ఉపవాసం చేశారు (యోనా 3:5).

ఫలితం — దేవుడు ఆ పట్టణాన్ని నాశనం కాకుండా కాపాడాడు.


చాలాసార్లు మనలో అనేక ప్రశ్నలు వస్తుంటాయి. అవి మనలను — “దేవుడు నాకు లేడు” లేదా “దేవుడు నా ప్రార్థనలు వినడం లేదు” అనే భావన లేదా స్థితిలోకి  తీసుకువెళ్తాయి. అలాంటి తీర్పుకు రావడానికి ముందు — దేవుడు కోరిన విధంగా, గ్రంథాల ప్రకారం మనం నిజంగా ఉపవాసం చేస్తున్నామా అని ఎప్పుడైనా ఆలోచించామా? బహుశా మనం దేవునిని ఇలా కూడా అడిగి ఉండవచ్చు: “ప్రభువా, నేను ఇంకేమి చేయాలి?” దేవుడు ఇప్పుడే మనతో మాట్లాడుతున్నాడు, మొదటి అడుగు వేయండి — ఎక్కువగా ఆలోచించకండి, ఇప్పుడే ఉపవాసం ప్రారంభించండి. 

మీరు ఏ విధమైన ఉపవాసం చేస్తారు లేదా ఎంతకాలం చేస్తారు అన్నదానికంటే,

RELATED POSTS

Heaven Is Extra Actual Than This World

A Lesson in Excruciating Belief

Wish to Construct a Pastoral Internship? 4 Steps

ఎలా చేస్తారు మరియు ఉపవాస సమయంలో ఏమి చేస్తారు లేదా ఎలా గడుపుతారు అన్నదే ముఖ్యమైనది.

గుర్తుంచుకోండి; 

  • ప్రార్థన లేకుండా ఉపవాసం — ఆత్మీయ మార్పు కాదు, ఆత్మీయ ఆకలే.
  • ఉపవాసం అంటే దేవుని వెదకడం — శరీరాన్ని హింసించుకోవడం కాదు.
  • ఉపవాసం మీకూ దేవునికి మధ్యలోనే ఉండాలి  — సోషల్ మీడియాకి కాదు.

పూర్ణ హృదయంతో దేవుని వెదకండి — ఆయన ప్రతిఫలంగా ఏమి చేస్తాడో చూడండి.


తన వాగ్దానాలను ఎప్పటికీ మరచిపోని దేవుడు, తన వాక్యము ద్వారా దేవుడు మన అందరినీ ఆశీర్వదించుగాక.

“గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ మన దేవుని వాక్యము యుగయుగాల వరకు నిలిచియుండును.”
(యెషయా 40:8)

Buy JNews
ADVERTISEMENT
ShareTweetPin
newjyizh

newjyizh

Related Posts

Heaven Is Extra Actual Than This World
Bible Study

Heaven Is Extra Actual Than This World

April 15, 2026
A Lesson in Excruciating Belief
Bible Study

A Lesson in Excruciating Belief

April 15, 2026
Wish to Construct a Pastoral Internship? 4 Steps
Bible Study

Wish to Construct a Pastoral Internship? 4 Steps

April 15, 2026
10 Issues You Ought to Know About Essential Idea
Bible Study

10 Issues You Ought to Know About Essential Idea

April 14, 2026
Wallpaper: Forged Our Sorrows
Bible Study

Wallpaper: Forged Our Sorrows

April 14, 2026
We Are All Barabbas (Mark 15:6–12)
Bible Study

We Are All Barabbas (Mark 15:6–12)

April 13, 2026
Next Post
AI & Accessibility In Ministry

AI & Accessibility In Ministry

Christian in Indonesia Arrested for Feedback on Muhammad

Christian in Indonesia Arrested for Feedback on Muhammad

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Our Ardour and Pursuit | Experiencing Worship

Our Ardour and Pursuit | Experiencing Worship

May 6, 2025
EXTRA! Concepts for Adults – Restricted Assets Limitless God – When Your Understanding Falls Brief

EXTRA! Concepts for Adults – Restricted Assets Limitless God – When Your Understanding Falls Brief

December 8, 2025
Muslim Kidnapper of Christian Woman in Pakistan Given Custody, Sources Say

Muslim Kidnapper of Christian Woman in Pakistan Given Custody, Sources Say

February 4, 2026

Popular News

  • A Studying Record to Begin Your Journey

    A Studying Record to Begin Your Journey

    0 shares
    Share 0 Tweet 0
  • Tim Keller Seen Evangelism and Justice as Biblically Inseparable

    0 shares
    Share 0 Tweet 0
  • Friendship and Masculinity — Church Anew

    0 shares
    Share 0 Tweet 0
  • What Can We Study from Voddie Baucham?

    0 shares
    Share 0 Tweet 0
  • Utilizing TikTok And Instagram As A Christian Influencer With Niya Esperanza And Kenny Jahng – ChurchTechToday.com

    0 shares
    Share 0 Tweet 0

About Us

At New Jerusalem Notes, our mission is simple: to uplift, inform, and inspire believers around the world through the power of God’s Word and the truth of the Gospel. We are a Christian blog committed to sharing timely news, deep biblical insights, and encouraging resources to help you grow in faith and stay connected to the global Body of Christ.

Categories

  • Bible Study
  • Christian News
  • Church
  • Worship

Recent News

  • Heaven Is Extra Actual Than This World
  • Able to Resist the Satan | David Lindell
  • Classes From the Lifetime of Gideon

Copyright © Newjerusalemnotes.com - All rights reserved.

No Result
View All Result
  • Home
  • Christian News
  • Bible Study
  • Church
  • Worship
  • Contact Us
  • Register
  • Login
  • Cart

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?