Newjerusalemnotes
  • Login
  • Home
  • Christian News
  • Bible Study
  • Church
  • Worship
  • Contact Us
  • Register
No Result
View All Result
  • Home
  • Christian News
  • Bible Study
  • Church
  • Worship
  • Contact Us
  • Register
No Result
View All Result
Newjerusalemnotes
No Result
View All Result
Home Bible Study

గుర్తింపులేని అమ్మాయి నిర్మించిన 3 పట్టణాలు

newjyizh by newjyizh
March 20, 2026
Reading Time: 2 mins read
0


RELATED POSTS

Jesus’s Temptation Adjustments How We See Our Personal

To the Unsaved Believer

The Position of the Resurrection in Acts

బైబిల్‌లో మనకు ఎంతో ప్రేరణనిచ్చే స్త్రీలు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు దెబోరా మరియు ఎస్తేరు వంటి స్త్రీలు దేవునిపై విశ్వాసంతో నిలబడి గొప్ప విజయాలను సాధించారు. వారు ఎదుర్కొన్న కష్టాలు, బలహీనతలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగి దేవుని కార్యంలో గొప్ప పాత్ర పోషించారు. అయితే బైబిల్‌లో మరో స్త్రీ గురించి కూడా చదువుతాము — ఆమె గురించి ఎక్కువగా మాట్లాడలేదు, ఆమె ప్రసిద్ధురాలు కాదు మరియు ఆమె పేరు కేవలం ఒక్క వచనములో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆమె చేసిన పని ఎంతో గొప్పది. ఆమె పేరు షెయెరా. ఆమె ఎఫ్రాయిము కుమార్తె. 1 దినవృత్తాంతములు 7:24 లో ఆమె మూడు పట్టణాలను నిర్మించినట్లు వ్రాయబడి ఉంది — ఉత్తరపు బేత్‌ హోరోనును దక్షిణపు బేత్‌ హోరోనును మరియు  ఉజ్జెన్‌ షెయెరా. “షెయెరా” (She’erah) అనే పేరుకు సాధారణంగా “మిగిలిపోయినది” లేదా “వెనుకబడినది” అనే అర్థం వస్తుంది.

ఆ కాలంలో కుటుంబ గౌరవం, పేరు, వారసత్వం ఎక్కువగా కుమారుల ద్వారానే కొనసాగుతుందని భావించేవారు. అందువల్ల తండ్రులు తమ కుమారుల పేర్లను గర్వంగా చెప్పేవారు, కానీ కుమార్తెలను చాలా అరుదుగా ప్రస్తావించేవారు. చాలాసార్లు వారి కృషికి  గుర్తింపు ఉండేది కాదు. 1 దినవృత్తాంతములు 7:20–29 లో ఎఫ్రాయిము వంశావళిని చదివితే అనేక మంది కుమారుల పేర్లు వరుసగా కనిపిస్తాయి. అయితే షెయెరా పేరు మాత్రం ఒక్క వచనములో మాత్రమే కనిపిస్తుంది. 

దీనివల్ల ఆమెకు కుటుంబంలో ఉన్న కుమారులంతగా ప్రోత్సాహం లేదా గుర్తింపు లభించకపోయి ఉండవచ్చు అని మనం ఊహించవచ్చు. అయినప్పటికీ షెయెరా తన పరిస్థితిని కారణంగా చేసుకొని వెనుకడుగు వేయలేదు, ఆమె ఎవరో గుర్తించేవరకు ఎదురు చూడలేదు కానీ ఆమె గుర్తుంచుకునే పనిని చేసింది. బైబిల్ ప్రకారం ఆమె రెండు ముఖ్యమైన పట్టణాలను నిర్మించింది — ఉత్తరపు బేత్‌ హోరోనును మరియు దక్షిణపు బేత్‌ హోరోను. ఇవి తరువాత ఇశ్రాయేలు చరిత్రలో చాలా ముఖ్యమైన ప్రాంతాలుగా మారాయి. అదనంగా ఆమె తన పేరుతోనే ఉజ్జెన్ షెయెరా అనే మరో పట్టణాన్ని కూడా నిర్మించింది.

ఈ పట్టణాల ప్రాముఖ్యత

బైబిల్‌లోని కొన్ని వచనాల ద్వారా ఈ పట్టణాల ప్రాముఖ్యతను మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు యెహోషువ 10:10–11, 1 సమూయేలు 13:18, 2 దినవృత్తాంతములు 8:5 (మరియు 1 రాజులు 9:17) వచనాలలో ఈ ప్రాంతాల ప్రాముఖ్యతను సూచిస్తాయి.

  • వ్యాపారం మరియు ప్రయాణానికి ముఖ్యమైన మార్గాల్లో ఉన్నాయి.
  • యుద్ధకాలంలో రక్షణకు మరియు ప్రాంతాన్ని కాపాడటానికి ఉపయోగపడ్డాయి.
  • వ్యాపారులు మరియు సైన్యాల కదలికలను నియంత్రించడానికి సహాయపడ్డాయి.
  • “ఉజ్జెన్ షెయెరా” అనే పట్టణం ఆమె పేరుతో పెట్టబడింది, ఇది ఆమె చేసిన పనికి నిలిచిపోయే గుర్తుగా ఉంది.

షెయెరా కథ మనకు చెప్పే పాఠం

షెయెరా కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు గుర్తింపు పొందని వారు, ఇతరులు పట్టించుకోని వారు, ఎన్నో  గొప్ప పనులు చేస్తారు. అది సంఘంలో అయినా, కుటుంబంలో అయినా, ఉద్యోగంలో అయినా, పాఠశాలల్లో లేదా కళాశాలల్లో అయినా  — మనకు కనిపించని వారు దేవుని కార్యంలో గొప్ప ప్రభావాన్ని చూపవచ్చు. షెయెరా పేరు బైబిల్‌లో ఒక్క వచనములో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆమె నిర్మించిన పట్టణాలు ఆమె కథ చుట్టూ ఉన్న నిశ్శబ్దం కంటే ఎక్కువగా మాట్లాడుతున్నాయి. కొన్నిసార్లు గొప్ప వారసత్వం మనకు ఎంత గుర్తింపు లభించిందన్నదిలో కాదు, గుర్తింపు లేకపోయినా మనం ఏమి చేసామన్నదానిలో ఉంటుంది.  ప్రపంచం ఏమి చెప్పినా సరే, దేవుని దృష్టిలో మనం ఎంతో విలువైనవారం. మనలను చూస్తున్న దేవుడు మన ఆలోచనలు మరియు క్రియల ప్రకారం ప్రతిఫలమిస్తాడు..

ఒక విషయం గుర్తుంచుకుందాం:

  • ఇతరులు మన విలువను గుర్తించకపోయినా దేవుడు చూస్తున్నాడు.
  • మనలను ఎవరూ పైకి లేపకపోయినా మనం దేవుని సహాయంతో ఇంకా గొప్ప విషయాలు చేయగలము.

ప్రపంచం కోసం కాదు — దేవుని కోసం పని చేద్దాం. అప్పుడు మన జీవితం కూడా ఒక రోజు అనేకమందికి ఆశీర్వాదంగా మారుతుంది.

Buy JNews
ADVERTISEMENT
ShareTweetPin
newjyizh

newjyizh

Related Posts

Jesus’s Temptation Adjustments How We See Our Personal
Bible Study

Jesus’s Temptation Adjustments How We See Our Personal

March 19, 2026
To the Unsaved Believer
Bible Study

To the Unsaved Believer

March 19, 2026
The Position of the Resurrection in Acts
Bible Study

The Position of the Resurrection in Acts

March 19, 2026
Find out how to Select God’s Phrase over The whole lot Else Begging for Our Consideration
Bible Study

Find out how to Select God’s Phrase over The whole lot Else Begging for Our Consideration

March 18, 2026
Praying the Bible
Bible Study

Praying the Bible

March 17, 2026
How a “Day of Darkness” Affords Future Hope
Bible Study

How a “Day of Darkness” Affords Future Hope

March 17, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

EXTRA! FOR STUDENT LEADERS—UNIT 3: OUR GOD—OUTLINE AND SOCIAL MEDIA

EXTRA! FOR STUDENT LEADERS—UNIT 3: OUR GOD—OUTLINE AND SOCIAL MEDIA

December 9, 2025
EXTRA! Concepts for Adults – Elisha: Seeing the Hand of God at Work – Session 4

EXTRA! Concepts for Adults – Elisha: Seeing the Hand of God at Work – Session 4

May 5, 2025
Nancy Guthrie’s pastor prays for her protected return

Nancy Guthrie’s pastor prays for her protected return

February 9, 2026

Popular News

  • A Studying Record to Begin Your Journey

    A Studying Record to Begin Your Journey

    0 shares
    Share 0 Tweet 0
  • Tim Keller Seen Evangelism and Justice as Biblically Inseparable

    0 shares
    Share 0 Tweet 0
  • Friendship and Masculinity — Church Anew

    0 shares
    Share 0 Tweet 0
  • Utilizing TikTok And Instagram As A Christian Influencer With Niya Esperanza And Kenny Jahng – ChurchTechToday.com

    0 shares
    Share 0 Tweet 0
  • Methods to Honor the Deceased in Your Church Listing

    0 shares
    Share 0 Tweet 0

About Us

At New Jerusalem Notes, our mission is simple: to uplift, inform, and inspire believers around the world through the power of God’s Word and the truth of the Gospel. We are a Christian blog committed to sharing timely news, deep biblical insights, and encouraging resources to help you grow in faith and stay connected to the global Body of Christ.

Categories

  • Bible Study
  • Christian News
  • Church
  • Worship

Recent News

  • గుర్తింపులేని అమ్మాయి నిర్మించిన 3 పట్టణాలు
  • 5 Lies Males Imagine about Their Roles within the Household
  • The Great Outcomes Of Highly effective Prayer | John Lindell

Copyright © Newjerusalemnotes.com - All rights reserved.

No Result
View All Result
  • Home
  • Christian News
  • Bible Study
  • Church
  • Worship
  • Contact Us
  • Register
  • Login
  • Cart

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?